News

తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు

391views

తైవాన్‌: స్వయం పాలిత తైవాన్‌ గగనతలంలోకి చైనా సోమవారం 52 యుద్ధ విమానాలను పంపింది. వాటిలో 34 జె-16 యుద్ధ విమానాలు, 12 హెచ్‌-6 బాంబర్లు ఉన్నాయి. తైవాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చైనా జెట్‌ల కదలికలను పరిశీలించిందని తైవాన్‌ జాతీయ రక్షణ శాఖ వెల్లడిరచింది. గత శుక్రవారం నుంచి చైనా ఇదే తరహాలో తైవాన్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

చైనా జాతీయ దినోత్సవం నాడు 38, శనివారం 39, ఆదివారం 16 యుద్ధవిమానాలను తైవాన్‌ మీదకు పంపింది. ఇంత భారీ సంఖ్యలో యుద్ధవిమానాలను తైవాన్‌ గగనతలంలోకి పంపించడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలపై అమెరికా స్పందించింది. శాంతికి భంగం కలిగించే చర్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రిన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా చేస్తున్నవి తప్పుడు పనులని వ్యాఖ్యానించారు. తైవాన్పై బలప్రయోగం మానుకోవాలని హితవు పలికారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి