News

రేపే విజయవాడలో హైందవ శంఖారావ సభ : పాల్గొననున్న సాధుసంతులు : వేలాదిగా తరలి రానున్న హిందువులు.

185views

9/12/2018 ఆదివారం సాయంత్రం 3గంటలకు విజయవాడ పటమటలోని హై స్కూలు రోడ్డులోని రైతు బజారు ఎదురుగా వున్న సభా స్థలిలో జరిగే హైందవ శంఖారావ సభకు, రామభక్తులు, హిందువులు వేలాదిగా తరలి రావలసిందిగా విశ్వహిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు.

ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా సర్వోన్నత న్యాయస్థానం అయోధ్య రామజన్మ భూమి అంశంపై తీర్పును వాయిదా వేసిన నేపధ్యంలో అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని కోరుతూ దేశ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో జరుగుతున్న అయోధ్య రామ మందిర నిర్మాణ సంకల్ప సభలలో భాగంగా విజయవాడలో ఈ సభ తలపెట్టామని ఈ సభకు మాతృమూర్తులు, యువతీ యువకులు, పూజ్య ధర్మాచార్యులు, కార్మిక కర్షక సోదరులందరూ తరలిరావాలని, కోట్లాది హిందువుల ఆకాంక్షను ప్రభుత్వాలకు వినిపించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు.