
640views
కాబూల్: విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్ మహిళలు చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై హింసాత్మక ధోరణి ప్రదర్శించారు.
6-12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్ మూవ్‌మెంట్ ఆఫ్ అఫ్గాన్ వుమెన్ యాక్టివిస్ట్స్’ బృందానికి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానికంగా ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు. దీంతో తాలిబన్లు వారిని అడ్డుకున్నారు. వెనక్కి నెట్టేసి, బ్యానర్లు లాగేసుకున్నారు. వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపినట్టు ఓ వార్త సంస్థ వెల్లడించింది.





