News

కాంగ్రెస్ నేత సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాజస్థాన్ లోని కర్తాల్ లో ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చే

307views
కాంగ్రెస్ నేత సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాజస్థాన్ లోని కర్తాల్ లో ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. అయితే ఈ మధ్యనే పాకిస్తాన్ వెళ్లి వచ్చిన సిద్ధూ కూడా ఈ నినాదాలు వద్దని వారించలేదు. నినాదాలు చేస్తున్నంత సేపు నవ్వుతూ ఉండిపోయారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సిద్ధూ పాకిస్తాన్ ఏజెంట్ లా మారిపోయారని విమర్శిస్తున్నారు. మరో వైపు సిద్ధూ పాకిస్తాన్ ప్రేమను  కొంతమంది కాంగ్రెస్ నేతలు వెనుకేసుకు వస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతోందని మరికొంత మంది బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.
Source: Bharath today.