News

ఐసిస్‌తో ఇరాక్‌ అతలాకుతలం!

275views

న్యూఢిల్లీ/బాగ్దాద్‌: కరుడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాదులతో ఇరాక్‌ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పోలీసులనే లక్ష్యంగా చేసుకుని, పాల్పడుతున్న దాడులకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐసిస్‌ తాజా దాడుల్లో 13 మంది ఇరాకీ పోలీసులు మృత్యువాత పడ్డారు. చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు దాడులకు దిగినట్టు ఆ దేశ సీనియర్‌ పోలీస్‌ అధికారి స్పష్టం చేశారు.

తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉగ్రవాదులు ఎక్కడికక్కడే స్లీపర్‌ సెల్స్‌ను పెట్టుకున్నారు. దీంతో ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులే కాకుండా, సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మనుగడ సాగిస్తున్నారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును కూడా దోచుకుపోతున్నారు. ఇ

స్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐఎస్‌ఐఎస్‌ఐ) ఈ ఉగ్రవాద సంస్థ 2006లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌(ఐఎస్‌ఐ) అనే పేరుతో పుట్టింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇరాక్‌, సిరియా దేశాల్లో తమ కార్యక్రమాలను నెరుపుతున్న ఈ ఉగ్రవాద సంస్థ ఆసియా, ఆఫ్రికాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ తమ వికృతి చేష్టలను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

SOURCE: Telugu.oneindia.com

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి