NewsSeva

గుంటూరు : ఆరోగ్య రక్షా సమితి కరపత్రం విడుదల

227views

సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక హిందూ కళాశాలలో ఆరోగ్య రక్షా సమితి పేరుతొ కోవిడ్ నుండి రక్షణ కొరకై ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బట్టు నాగరాజు గారు (డైరెక్టర్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నాగార్జున యూనివర్సిటీ ) పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో లో 150 మంది విద్యార్థినీవిద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణ చేశారు. కోవిడ్ రాకుండా వ్యాధి నిరోధక ఆయుర్వేదిక్ మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవా భారతి రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ కాకాని పృథ్వీరాజు పాల్గొన్నారు.

డాక్టర్ బట్టు నాగరాజు గారు మాట్లాడుతూ కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భం గమనిస్తే ఇది 3rd వేవ్ కు సూచన అని తెలియజేశారు. 3rd వేవ్ నుండి పిల్లలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కరపత్రంలో ఉన్నాయని, ఈ కరపత్రాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని ఈ విషయాన్ని ఇంటింటికీ…. పిల్లలకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.

సేవా భారతి రాష్ట్ర  సంఘటన కార్యదర్శి శ్రీ కాకాని పృథ్వీరాజు మాట్లాడుతూ  రాష్ట్ర మంతటా సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు జనజాగరణ ఉద్యమం జరుగుతుందని అందులో 25 వేల మంది కార్యకర్తలు పనిచేస్తూ ఎనిమిది వేల గ్రామాలలో ఇంటింటికీ తిరిగి కోవిడ్ ముప్పుపై అవగాహన కలిగిస్తారని చెప్పారు. కోవిడ్ టీకా వంద శాతం ప్రజలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తారని తెలియజెశారు .

ఈ కార్యక్రమంలో సేవాభారతి గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్, సేవా భారతి జిల్లా ఆర్గనైజర్ శ్రీ జాగు శ్రీనివాసు, శ్రీ శేషారావు, శ్రీ ప్రదీప్ బ్లడ్ గ్రూప్ కార్యక్రమాన్ని నిర్వహించారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.