
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 29 న ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకుని అక్కడి శ్రీరాముని ఆలయంలో పూజలు చేస్తారు. ఆయన హనుమాన్ గర్హి మరియు కనక్ భవన్ లలో కూడా ప్రార్థనలు చేయనున్నారు.
రాష్ట్రపతి కోవింద్ ఆగస్టు 29 న ప్రత్యేక రైలులో లక్నో నుండి అయోధ్యకు వెళ్తారు. శ్రీ కోవింద్ శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యను సందర్శించిన మొదటి రాష్ట్రపతి అవనున్నారు. అయోధ్యకు చేరుకున్న తర్వాత, రాష్ట్రపతి కోవింద్ శ్రీరాముని తాత్కాలిక దేవాలయంలో పూజలు చేస్తారు.
ఆయనతో పాటు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మరియు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ కూడా ఉంటారు. అయోధ్యలో శ్రీరామ దేవాలయ నిర్మాణాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 5 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి అయోధ్యలో భూమి పూజ చేశారు.
రాష్ట్రపతి నాలుగు రోజుల (ఆగస్టు 26-29) పాటు ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉంటారు. అక్కడ అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆయుష్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఆయన గోరఖ్ పూర్ వెళ్తారు. గోరఖ్ పూర్‌లో, ఆయన గోరఖ్ నాథ్ విశ్వవిద్యాలయం యొక్క ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఈ ఏడాది జూన్ 25 న రాష్ట్రపతి కోవింద్ తన స్వస్థలమైన కాన్పూర్ ను రైలులో వెళ్లి సందర్శించారు.
Source : Organiser