News

చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్..

531views

కోవిడ్‌ అనేక దేశాల్లో తిరగబెడుతోంది. డెల్టా వేరియంట్ చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపిస్తూ.. చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

చైనాలో మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. వీటిలో డెహోంగ్‌, నన్‌జింగ్‌, ఝెంగ్‌జౌ సహా 4 ప్రాంతాలు ‘తీవ్ర ముప్పు’లో ఉన్నట్లు తెలిపింది. రాజధాని బీజింగ్‌లో ఆదివారం బయటపడిన కొత్త కేసులు మూడింటికీ ‘డెల్టా’ వేరియంట్‌ కారణమని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) నిర్ధారించింది. కొవిడ్‌ వ్యాప్తి ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధానికి వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బీజింగ్‌ మున్సిపల్‌ గవర్నమెంట్‌ ప్రకటించింది. చైనాలో కొవిడ్‌ ఉద్ధృతి నాన్‌జింగ్‌ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనంతరం వైరస్‌ అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ఈ నగరంలో 204 కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.