
దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించడంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ-రూపిని ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ వోచర్ ఆధారిత డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. దాని UPI ప్లాట్‌ఫామ్ లో, ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య అథారిటీ సహకారంతో రూపొందించారు. ఈ-రూపీ చెల్లింపు సేవ సహాయంతో, వినియోగదారు కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేకుండా వోచర్ ను రీడీమ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి.. ‘ఈ-రూపీ’ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్ లతో సంబంధం లేకుండా.. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడనుంది. ఈ-రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో.. అదే ఉద్దేశానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇతర చెల్లింపులకు అది పనికిరాదని తెలిపింది.





