
భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరులో బి ఎం ఎస్ కార్యాలయం “మజ్దూర్ ఘర్” ప్రారంభమైంది. భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి శ్రీ బి. సురేంద్రన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శ్రీ సురేంద్రన్ మాట్లాడుతూ మజ్దూర్ సంఘ్ కార్యాలయం సమాచార కేంద్రం (ఇన్ఫర్మేషన్ సెంటర్)గా మారాలన్నారు. “కార్మికులకు ఎటువంటి సమస్య తలెత్తినా దానికి సంబంధించిన సమాచారం (ఇన్ఫర్మేషన్) ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని మన కార్యాలయం కలిగి ఉండాలి” అని ఆయన వివరించారు. శ్రీమతి జూపూడి హైమావతి, బి ఎం ఎస్ కార్యదర్శులు శ్రీ రాధా కృష్ణ, శ్రీ సామా బాలిరెడ్డి లతో పాటుగా శ్రీ జూపూడి రంగరాజు, శ్రీ కాయితి సైదారెడ్డి, శ్రీ Ch. వెంకటేశ్వర్లు, శ్రీ మాజేటి ముత్యాల రావు, శ్రీ కొల్లా రాధాకృష్ణ మూర్తి, శ్రీ కాకాణి పృథ్విరాజు మరియు పలు కార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని బి ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రావణ్ కుమార్ నిర్వహించారు.






