ఉత్తరాఖండ్ లో కావడ్ యాత్ర రద్దు… ఉత్తరప్రదేశ్లో షరతులతో కూడిన అనుమతి… కోవిడ్ మూడో దశ నేపథ్యంలో నిర్ణయం..

738views
కరోనా మూడోదశను దృష్టిలో ఉంచుకొని కావడ్ (కావడి) యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మూడో వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్లను పరిగణనలోకి తీసుకుని యాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.
కరోనా కారణంగా ఉత్తరాఖండ్ లో కావడ్ యాత్ర రద్దు కావడం ఇది రెండో సారి. కానీ ఉత్తర ప్రదేశ్ లో మాత్రం కరోనా ఆంక్షలను పాటిస్తూ జూలై 25 దాకా ఈ యాత్ర నిర్వహించేందుకు యోగి సర్కారు అనుమతినిచ్చింది.





