భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అలుపెరగని విజయయాత్రలో 2018వ సంవత్సరం మైలురాయిలా నిలుస్తుంది. చారిత్రక విజయాలు నమోదు చేసింది. స్వీయ లక్ష్యాలు, ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లు, చిక్కుముడులు ఛేదిస్తూ ఇస్రో బృందం ముందుకు సాగింది
ప్రాంతీయ నావిగేషన్ అవసరాల కోసం అతి భారీ ఉపగ్రహాలను ఏడింటిని GSLV MK 3 ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి భారత ప్రభుత్వ అనుమతి సాధించడంతో ఇస్రో అంతరిక్ష యాత్రలో రెండు కొత్త పదాలు చేరాయి. గగన్ యాన్, వ్యోమనాట్ ప్రాజెక్ట్ లకు కూడా ఇదే ఏడాది బీజం పడింది.
అగ్రదేశాల సరసన భారత్ – అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం. జనవరి 3 2019న చంద్రయాన్ 2
ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ఈ ఏడాది ఆగస్ట్ 15న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గురించి ప్రకటన చేశారు. ఇద్దరు లేక ముగ్గురు వ్యోమగాములను భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని తొలి కక్ష్యలోకి పంపించే ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. వీరు వారం రోజులపాటు ఈ కక్ష్యలోనే పరిభ్రమిస్తారు. ఈ ప్రయోగాన్ని 2022 లోగా పూర్తి చేయాలని ఇస్రోకి గడువు విధించారు. దీంతో, బెంగళూరులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణురాలైన డాక్టర్ వీఆర్ లలితాంబిక ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నారు.
చారిత్రక ప్రయోగాలను దిగ్విజయంగా చేపట్టిన ఇస్రో, మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో కీలక ప్రయోగాలను ఇప్పటికే పూర్తి చేసింది. మానవ సహిత ప్రయోగంలో లాంఛ్ ఎస్కేప్ సిస్టం అత్యంత కీలకమైనది. ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా భూ వాతావరణంలోనే పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వ్యోమగాముల ప్రాణాలను కాపాడేలా ఎస్కేప్ లాంఛ్ ఫాడ్ ను రూపొందించారు. వాహక నౌకను రాకెట్ మోసుకెళుతున్న సమయంలో చిన్నపాటి రాకెట్ ను పైభాగాన అమరుస్తారు. ప్రమాదం జరిగినప్పుడు వ్యోమగాములు వున్న క్యాప్సుల్ ను ఈ చిన్నపాటి రాకెట్ ప్రధాన వాహక నౌక నుంచి విడదీసి ప్యారాచూట్ సహాయంతో కొన్ని కిలోమీటర్ల అవతలకు సురక్షితంగా తీసుకెళుతుంది. భారత్ తొలి అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మకు కూడా ఇలాంటి పరోక్ష అనుభవం ఎదురైంది.
ఈ ఏడాది జనవరిలో PSLV C 40 (పీఎస్ఎల్వీ సీ 40) ద్వారా కార్టోశాట్ 2 సిరిస్ ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన 30 చిన్నపాటి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా అరుదైన ఘట్టాన్ని ఇస్రో ఆవిష్కరించింది. గత ఏడాది IRNSS 1 H లో జరిగిన పొరపాటును శాస్త్రవేత్తలు సరిదిద్దుకుని, ఓటమి పాఠాలు నేర్చుకుని ఈ ఏడాది ఏప్రిల్ లో IRNSS 1 Lని సమర్థవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో నేవగేషన్ విషయంలో భారత్ స్వయం చోదక శక్తిగా ఎదిగింది. ప్రాంతీయ నేవిగేషన్ కోసం పాశ్చాత్య దేశాలపై ఆధార పడే పరిస్థితిని అధిగమించింది.
2018
ఇస్రో ఈ ఏడాది మొత్తం 17 ప్రయోగాలను నిర్వహించింది.
2019 లో ఇస్రో లక్ష్యాలు
ఏడాది ప్రారంభంలో 800 కోట్ల రూపాయల చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కు జనవరిలో అంకురార్పణ32కి పైగా ఉపగ్రహ ప్రయోగాల లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. 8 PSLVలు 2 GSLV MK 2, గగన్ యాన్ ప్రాజెక్ట్ కోసం 2 GSLV MK 3 ప్రయోగాలు 2019లో జరగనున్నాయి.
ప్రైవేటు స్పేస్
2018 లో ఇస్రో మరో అడుగు వేసింది. ఉపగ్రహాల నిర్మాణానికి మూడు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉపగ్రహాల నిర్మాణం, పరీక్షలు, అసెంబ్లింగ్ కోసం ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కి కీలక కాంట్రాక్ట్ లు అప్పచెప్పింది. ఈ మూడు కంపెనీలు 27 ఉపగ్రహాలను నిర్మించనున్నాయి. ఇందులో ఏడు సమాచార ఉపగ్రహాలు, 12 భూ పరిశీలనా ఉపగ్రహాలు, అయితే, నేవిగేషన్ శాటిలైట్లు, మూడు సైన్స్ శాటిలైట్ లు ఉంటాయి.
Source: Bharath today.
https://www.bhaarattoday.com/news/news/record-of-isro/29828.html