NewsProgramms

అలరించిన సంస్కార భారతి స్వర సమ్మేళనం

1.1kviews

సంస్కార భారతి సాంస్కృతిక సేవా సంస్థ ఉగాది సందర్భంగా కౌతా పూర్ణానందం కళావేదికపై మంగళ వారం నిర్వహించిన స్వర సంగీత సమ్మేళనం అందరినీ అలరించింది. తెలుగు ఉగాది వచ్చింది, ఓహో.. వసంతమా గీతం.., ఎంతచక్కని దోయి ఈ పూలతోట, సన్నజాజి ఎందుకో సిగ్గుపడింది, చిన్నారి కోయిలమ్మ, ఈ వసంతాలలో చిగురుమావి, కొమ్మలలో కోయిలమ్మ తదితర గీతాలను సత్యవతి, జ్యోతి రామలక్ష్మి, సీతారత్నం, ఆదుర్తి సుహాసిని, సరస్వతి, డాక్టర్ పల్లవి, భారతి, సత్య గానం చేశారు. సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ రాంకుమార్ గూటాల ప్రసంగించారు. సినీ, రంగస్థల నటుడు మిశ్రోకు కౌతా పూర్ణానందం పురస్కారాన్ని అందించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.