ArticlesNewsvideos

మేము సైతం రామ మందిర నిర్మాతలవుతాము……

567views

యోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం కోసం జరుగుతున్న నిధి సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రామ సేవకులకు ఎన్నో రోమాంచిత అనుభవాలు ఎదురవుతున్నాయి.

తెలంగాణలోని ఒక గ్రామంలో నిధి సేకరణ నిమిత్తం రామ సేవకులు ఒక ఇంటికి వెళ్లారు. అది చాలా చిన్న పూరి గుడిసె. అందులో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. రామ సేవకులు అక్కడికి వెళ్లేటప్పటికి ఆ వృద్ధ దంపతులు ఆ పూరి గుడిసె బయట వంట పనిలో నిమగ్నమై ఉన్నారు. తామెందుకు వచ్చామో రామ సేవకులు వివరించేటప్పటికి ఆ వృద్ధ దంపతుల కళ్ళలో అంతులేని ఆనందం కనిపించింది. వెంటనే ఆ పెద్దాయన తన పక్కనున్న చేతి సంచిలో చేయి పెట్టి ఎక్కడో మూల తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బుల కోసం ఆతృతగా వెదకడం మొదలుపెట్టాడు. సంచిలోని వస్తువులన్నీ చకచకా తీసి బయటపెట్టి అడుగున మరో చిన్న పాలిథిన్ కవర్లో దాచి ఉంచుకున్న ఐదు వందల రూపాయల నోటును తీసి రామ సేవకుల చేతిలో పెట్టాడు.

https://m.facebook.com/story.php?story_fbid=10220166926263997&id=1251542657

అంత పెద్ద వయసులో తమకు ఏ ఆధారమూ లేకపోయినా, రేపు ఏ అవసరం ముంచుకొస్తుందోననే ఆలోచన కూడా లేకుండా రామ సేవకులు అడిగీ అడగంగానే తమ చేతిలో ఉన్న డబ్బులు మొత్తాన్ని శ్రీ రామ మందిర నిర్మాణ నిధికి సమర్పించడం చూసి రామ సేవకులు పులకించిపోయారు. అత్యంత సామాన్యులు సైతం అనన్య సామాన్యంగా స్పందిస్తూ ఉండడం చూసి హిందూ సమాజంలో రామతత్వం ఎంతగా జీర్ణించుకు పోయిందో కదా? ఆ పూరిగుడిసెలో బ్రతికే నిరుపేద వృద్ధ దంపతుల ఆరాటం, భక్తి, ధనాన్ని సమర్పించిన తర్వాత వారి కళ్లలో కనిపించిన తృప్తి, ఆనందం మన సనాతన హైందవ సంస్కృతి వైశిష్ట్యానికి నిదర్శనం కదా? ఈ దృశ్యాన్ని చూడడంతో మన జన్మలు సైతం ధన్యమైనవి కదా? అనుకుంటూ రామ సేవకులు అక్కడినుంచి తిరుగుముఖం పట్టారు.

ఇందుకే…. రామ మందిరానికి కోట్లాది రూపాయల నిధిని సమర్పించడానికి సంపన్నులెందరో ముందుకు వస్తూ ఉన్నా….. అయోధ్య రామ మందిరం నిర్మాణ యజ్ఞంలో సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చెయ్యడానికే అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు వాడవాడలా గ్రామ గ్రామాన నిధిని సేకరించాలనే సంకల్పం చేశారు. అదే…. ఆ సంకల్పమే…. సమాజంలోని ప్రతి వ్యక్తికీ అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య మందిర నిర్మాణంలో భాగస్వామిని చెయ్యగలిగింది. అందుకీ ప్రతి వ్యక్తీ, ప్రతి హృదయమూ రామ మందిర నిర్మాణ మహా యజ్ఞంలో పాలు పంచుకోవాలని తహతహలాడుతోంది. నేను సైతం రామ మందిర నిర్మాణ మహా యజ్ఞంలో ఒక సమిధ వేశానని ప్రతి హృదయమూ ఆనంద తాండవం చేస్తోంది. జై శ్రీరాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.