News

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి

881views

ర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన ఆర్ ఎస్ ఎస్ ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు ధర్మజాగరణ జిల్లానిధి ప్రముఖ్ శ్రీ దామం సురేష్ ఆధ్వర్యంలో పలురకాలుగా పోరాడి, ధర్నాలు చేసి కేసులు నమోదు చేసి దుర్ఘటన సమాచారాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయార్ స్వామి వారి దృష్టికి తీసుకుని వెళ్ళారు. దాంతో ఈనెల (జనవరి) 18వ తేదీన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయార్ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. జనవరి 28వ తేదీన పునఃప్రతిష్ట కు ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి వారి శిష్యులు శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు విచ్చేసి ఆంజనేయస్వామికి వేదమంత్రాలతో అభిషేకం చేసి నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. ఆలయ పునఃప్రతిష్టకు విశిష్ట అతిథిగా విచ్చేసిన ధర్మజాగరణ సమితి ఆంధ్రరాష్ట్ర ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య మాట్లాడుతూ ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో 7రోజుల్లో ఆంజనేయస్వామి ఆలయం కట్టడం చరిత్రలో లిఖించబడుతుందని, ఇటువంటి అపూర్వ ఘట్టంలో ధర్మజాగారణ సమితి సభ్యులు భాగస్వాములు కావడం వారందరి పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ విఠల్, శ్రీ శివరామక్రిష్ణయ్య , జిల్లా చెన్నకేశవ పరియోజన ప్రముఖ్ శ్రీ TD ఘనమద్దిలేటి స్వామి మరియు శ్రీ రవికుమార్ రెడ్డి తదితరులు హజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.