News

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు

819views

‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం – (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు ప్ర‌కారం బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డితే జ‌రిమానాల‌తో పాటు, జైలు శిక్ష విధిస్తూ ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

మోసపూరిత మార్గాల ద్వారా జరిగే మత మార్పిళ్ల‌కు వ్యతిరేకంగా ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్న‌టు్ట మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి న‌రోత్తం మిశ్రా తెలిపారు.
“ఈ బిల్లు ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన మైన‌ర్ బాలికలను, మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా మ‌తం మార్చ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు రుజువైతే రూ .50వేల జ‌రిమాన‌తో పాటు 2 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు.” అని మిశ్రా మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు.

బిల్లు ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమిష్టిగా మత మార్పిడికి పాల్పడితే 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా ఈ మతమార్పిళ్ల‌కు సహాయపడే సంస్థను నడుపుతున్న వారితో పాటు అటువంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల కూడా శిక్షార్హుల‌వుతారు.
అయితే, స్వచ్ఛందంగా ఇతర మతాలకు మారాల‌నుకునే వారు రెండు నెల‌ల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో ప్ర‌తిపాధించారు. సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైతే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ .50,000 జరిమానా విధించవచ్చు.

మతమార్పిళ్ల‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిన ఉత్తర ప్రదేశ్ తరువాత దేశంలో రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. గత నెలలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కొత్త మ‌త మార్పిళ్ల వ్యతిరేక చట్టాన్ని యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు.

అక్రమాలకు పాల్పడితే 10 అడుగుల లోతులో పాతేస్తాం – మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే వారు రాష్టాన్ని విడిచిపెట్టి వెళ్లకపోతే 10 అడుగుల లోతులో పాతేస్తానంటూ హెచ్చరించారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి రోజును కేంద్రం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

‘నేను ఈ రోజు సీరియస్‌ మూడ్‌లో ఉన్నాను. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిని నేను విడిచిపెట్టను. అలాంటి వారు మధ్యప్రదేశ్‌ నుంచి పారిపోవాలి. లేకపోతే 10 అడుగుల లోతులో పాతిపెడతాను. మీ ఆచూకీని ఎవ్వరూ గుర్తించలేరు’ అంటూ శివరాజ్‌ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారని అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అలాంటి పాలనే కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.