News

కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు……

172views

మానవత్వంతో సేవ కార్యాక్రమాలు చేసేవారు నుదిటిపై బొట్టు, తలపై కాషాయపు రంగు టోపి

పెట్టుకోకూడదా అలా పెట్టుకుంటే పోలీసులు కేసులు పెడతారా లాక్  డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన అవుననే చెబుతోంది .

సెక్యులర్ పాలన అంటే ఏమిటో  తెలుసుకోవాలనుకునే వారికి ఈ కేసు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో ఎండల్లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వారికి నిజామాబాద్ నగరానికి చెందిన కొందరు యువకులు రాగి జావ, మజ్జిగ, పండ్లను పంపిణీ చేశారు, కొన్ని ప్రాంతాల్లో పంపిణి చేస్తూ  నగరంలోని  నెహ్రూ పార్క్ వద్దకు చేరుకు న్నారు.

అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇచ్చేందుకు  ప్రయత్నించడంతో ఓ పోలీసు అధికారి అడ్డుకున్నారు.

అడ్డుకోవడమే కాదు వారిపై కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని 188, 269, 270  ఐపీసీ  సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేసి  సాయంత్రం  వరకు వారిని స్టేషన్లో ఉంచారు.

పోలీసు అధికారుల అనుమతి తీసుకుని, కోవిడ్ నిబంధనలు  పాటించే ఇదంతా చేస్తున్నామని చెప్పినా వినకుండా వారిపై కేసు నమోదు చేసి కోర్టు మెట్లు ఎక్కించారు.

ఈ కేసు మూడు రోజుల క్రితం కోర్టుకు చేరింది. కోర్టులో జడ్జి గారు మీరు చేసిన తప్పు ఏమిటని యువకులను ప్రశ్నించారు.  లాక్ డౌన్ సమయంలో చౌరస్తాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రాగిజావ, మజ్జిగ, పండ్లు పంపిణీ చేశామని చెప్పిన సమాధానంతో జడ్జి ఆశ్చర్యపోయారు.  మంచిపనే చేశారు కదా? అన్నారు.

మరి కేసు ఎందుకు పెట్టారని పోలీసులను పశ్నిస్తే  వారంత  కాషాయ టోపీలు పెట్టుకుని ఉన్నారని  చెప్పడంపై  జడ్జి అసహనం వ్యక్తం చేశారు.  సేవ చేసుకునేందుకు  ఎలా ఉంటే ఏమిటీ?  ఇది మంచి పద్ధతి కాదని, మళ్లీ ఇలాంటిది జరగకుండా చూడాలని పోలీ సులను హెచ్చరించారు .  సేవా కార్యక్రమాలు చేసే  ముందు జాగ్రత్తగా ఉండాలని యువకులకు కూడా సలహా ఇచ్చి,నలుగురికీ జరిమానా విధించారు జడ్జి గారు.

పోలీసులకు ఒకరి సంస్కృతి,  సంప్రదాయాలు నచ్చకపోతే  కేసులు పెడతారా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిని ఆలోచింపజేస్తోంది. బొట్టుపెట్టుకుంటే, కాషాయ టోపీలు ధరిస్తే నేరమవుతుందా? అని తలలు పట్టుకుంటున్నారు.  లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎందరిపై కేసులు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

ఈ కేసు గనుక సుప్రీంకోర్టుకు చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి చర్చనీయాంశం  అయ్యేది.  హిందూ సంస్కృతి సంప్రదాయాలు పాటించడంపై వివాదం తలెత్తేది. సెక్యూలర్ పాలనంటే ఇదేనా? అని కోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించేది.

ఈ కేసులో ప్రత్యేకత ఏముందని అనుకునే వారుం టారు. పత్రికలు, మీడియాకు ఇది వార్త కాకపోవచ్చు. ఇవాళ వీరికి జరిగింది, రేపు మీ వరకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపడం కోసమే చేసిన ప్రయత్నం అందరూ ఆలోచించండి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.