News

జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులు ఖతం

97views

మ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

జమ్మూ నుంచి శ్రీనగర్‌ వైపు వెళ్తున్న ట్రక్కును గురువారం తెల్లవారుజామున నగ్రోటా టోల్‌ ప్లాజా వద్ద తనిఖీ నిమిత్తం ఆపగా.. అందులోని ముష్కరులు ఆటోమెటిక్ ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ము ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీస్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ఈ ఘటనలో గాయపడ్డ ఒక పోలీస్‌ కానిస్టేబుల్ ‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఉదయం జరిగిన ఘటనతో బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఈ ఏడాదిలో ఈ తరహాలో జరిగిన రెండో ఆపరేషన్ ఇది. జనవరి 31న కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.