
50views
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని కలిగించేందుకే శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించారని ప్రతీతి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.