
899views
ఆఫ్గనిస్థాన్ సిక్కు నాయకుడు నిదాన్‌సింగ్ సచ్‌దేవాకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. గత నెలలో పాక్తియా ప్రోవిన్స్‌లో సచ్‌దేవాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయగా, శనివారం విడిచిపెట్టినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఆఫ్గన్ ప్రభుత్వానికి, పాక్తియా ప్రాంత గిరిజన పెద్దలకు మా అభినందనలు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. ఓ ప్రకటనలో మంత్రిత్వ శాఖ పేర్కొంటూ ఉగ్రవాదులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని హింసించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బెదిరింపులు ఎదుర్కొంటున్న హిందూ, సిక్కు ప్రజలను భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఇటీవలే నిర్ణయించినట్లు పేర్కొంది.





