News

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలపై చర్చిల అరాచకం

250views

షెడ్యూల్ కులాలకు చెందిన కొన్ని కుటుంబాలు దాదాపు 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లి గ్రామ శివార్లలోనే ఉంటున్నాయి. ఈ కుటుంబాలు బుడగ జంగాల కమ్యూనిటీకి చెందినవి. మహిళలు, పిల్లలు, వృద్ధులతో పాటు చిన్న గుడిసెలలో నివసిస్తూ ఉంటారు. వారి గుడిసెలు నిరుపయోగమైన పోరంబోకు భూమిలో ఉన్నాయి. వారు చాపలు అల్లటం, సోది చెప్పటం, వివిధ వస్తువులను అమ్మడం మరియు భిక్షాటనల ద్వారా జీవనం సాగించే సెమీ సంచార సమాజం. వారు జీవనోపాధి కోసం వివిధ గ్రామాలలో  తిరుగుతారు. కొన్ని రోజుల తరువాత తిరిగి వారి గుడిసెలకు వస్తారు.

ఇలా ఉండగా, ఇటీవల కృపాకర్, అశోక్ అనే ఇద్దరు పాస్టర్లు వీరి గుడిసెలకు సమీపంలో చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత, ఈ షెడ్యూల్డ్ కుల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం సమీప గ్రామాలకు వెళ్ళినప్పుడు చర్చి ప్రతినిధులు వీరి భూమిని ఆక్రమించడం ప్రారంభించారు. వారు తిరిగివచ్చిన  తర్వాత పాస్టర్లను ప్రశ్నించినప్పుడు, వారు చాలా మహిళలతో సహా అందరికీ దురుసుగా, అసభ్యమైన భాషలో సమాధానమివ్వడం ప్రారంభించారు. వారు ఆ స్థలాలను ఖాళీ చేయకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించడం ప్రారంభించారు.

స్థానిక పోలీసులు కూడా బాధితులకు సహాయం చేయడానికి బదులుగా, నిరసన వ్యక్తం చేస్తున్న వారిలో కొంతమందిని స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ కుటుంబాలను బలవంతంగా తొలగించిన చర్చి పాస్టర్లను పోలీసులు లేదా పరిపాలన అధికారులు ఎవరూ కనీసం ప్రశ్నించలేదు. చర్చి అధికారుల పలుకుబడికి పోలీసులు, ఇతర అధికారులు లొంగిపోయారు.

అక్కడ నివసిస్తున్న ఎస్సీ కుటుంబాల నిరసనల మధ్యనే చర్చి నిర్మాణాన్ని కొనసాగిస్తున్న చర్చి పాస్టర్లు

ఎల్‌ఆర్‌పిఎఫ్ జోక్యం

బాధితులు తమ అనుభవాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్‌ఆర్‌పిఎఫ్) కు వివరించారు.  అట్టడుగు వర్గాల కుటుంబాలపై చర్చి చేసిన దౌర్జన్యాలకై చర్చి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ LRPF జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) మరియు కడప జిల్లా కలెక్టర్‌ లను సంప్రదించింది.

ఎల్‌ఆర్‌పిఎఫ్ తన ఫిర్యాదు లేఖలో, చర్చి పాస్టర్లచే కుటుంబాలను తొలగించడం అనేది ‘జీవిత హక్కు’ను అణిచివేసే ఒక స్పష్టమైన కేసు అని పేర్కొంది. జీవించే కనీస హక్కుకు భారత రాజ్యాంగం తన ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇస్తుందని కూడా LRPF తన ఫిర్యాదులో పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల ప్రజలను చర్చి అధికారులు వేధింపులకు గురిచేశారంటూ ఎల్‌ఆర్‌పిఎఫ్ పేర్కొంది. జరిగిన దుర్ఘటన విషయంలో స్థానిక పరిపాలన మరియు పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండడిపోయిన విషయాన్ని కూడా LRPF అందులో ప్రస్తావించింది.

నిస్సహాయ ఎస్సీ కుటుంబాలు తమ భూమిని, ఇళ్లను కాపాడుకోవటానికి ప్రయత్నించినప్పుడు, నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్సీ ప్రజలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని ఎల్‌ఆర్‌పిఎఫ్ పేర్కొంది. “స్థానిక పరిపాలన చర్చి నిర్మాణాన్ని ఆపి, క్రైస్తవ పాస్టర్ల యొక్క అహంకారపూరిత ప్రవర్తనను అంతం చేయడం ద్వారా పేద ఎస్సీ కుటుంబాలను రక్షించడానికి అడుగులు వేయడం లేదు, పేద ఎస్సీ కుటుంబాలు వారి ఇళ్ళు, వారి జీవనోపాధి మరియు స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయాయి. భయం, ఉల్లంఘించబడింది “అని LRPF ఫిర్యాదు లేఖలో పేర్కొంది.

జాతీయ Sc కమీషన్ (ఎన్‌సిఎస్‌సి) ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఎస్‌సి కుటుంబాలు తమ గుడారాలు / గుడిసెలు వేసుకునేలా ప్రత్యామ్నాయ గృహనిర్మాణ స్థలాన్ని అందించాలని జిల్లా యంత్రాంగానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఎల్‌ఆర్‌పిఎఫ్ కోరింది. మహిళలు మరియు పిల్లలను కలిగి ఉన్న అట్టడుగు వర్గాల కుటుంబాలపై చేసిన నేరాలకు చర్చి పాస్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎల్‌ఆర్‌పిఎఫ్ ఎన్‌సిఎస్‌సి మరియు జిల్లా పరిపాలనను అభ్యర్ధించింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.