
468views
చైనా భారత్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనీయ “రుధిర నిర్ ఝరుల స్నానముచేసి…….” అంటూ జాతీయ విప్లవకవి,కవికోకిల గుఱ్ఱం జాషువా వ్రాసిన పద్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గుఱ్ఱం జాషువా రాసిన ఈ పద్యాన్ని తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆలపించారు.
చైనీయ రుధిర నిర్ ఝరుల స్నానముచేసి
భరత సైనిక కోటి మరలుదాక
కుటిలనీతిజ్ఞుల గురు కపాలములతో
అభవుండు తాండవమాడుదాక
పగవాని క్రొవ్వుతో బసవశంకరమౌళి
నిలయాన దివ్వెలు వెలుగుదాక,
భారతీయుల భుజబల సంపత్తి
పంచఖండము లాక్రమించుదాక
హైందవమహోర్వి సరిహద్దులాక్రమించి
కాలుమోపిన కుటిల ముష్కరునిశిరము
మంచుమలమీద దృష్టి కెత్తించుదాక
నిద్రపోవదు భారత భద్రకాళి
– జాతీయ విప్లవకవి,కవికోకిల గుఱ్ఱం జాషువా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.