News

కాశ్మీర్లోని ఏకైక హిందూ సర్పంచ్ ను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు

696views

మ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఏకైక కాశ్మీరీ పండిట్ సర్పంచ్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.  ప్రాధమిక చికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజయ్ పండిట్ మరణించాడు.  ప్రశాంతంగా వున్న కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు చేసిన ఈ ఘాతుకంతో కలకలం రేగింది.

అజయ్ పండిట్ గా గుర్తించబడిన కాశ్మీరీ హిందూ బాధితుడు అనంతనాగ్ జిల్లాలోని లార్కిపోరా ప్రాంతానికి చెందిన సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.  తన సొంత గ్రామంలోనే సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో సర్పంచ్ అజయ్ పండిట్ తన తోటకి వెళ్లినప్పుడు, గుర్తు తెలియని ఉగ్రవాదులు అతన్ని కాల్చివేసి అక్కడి నుంచి పారిపోయారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే 40 ఏళ్ల బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు అతను చికిత్స పొందకముందే మరణించాడు. ఒక వైపు నుంచి భద్రతా దళాలు లోయలో ఉగ్రవాదులను తుడిచివేసే పనిని కొనసాగిస్తూనే ఉన్నాయి.  సోమవారం తెల్లవారుజామున, షోపియన్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Source : JK Now.

https://www.jammukashmirnow.com/Encyc/2020/6/8/Attacks-on-Kashmiri-Hindus-continue-in-the-valley-Sarpanch-Ajay-Pandita-shot-dead-by-terrorists-in-Anantnag-.amp.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.