News

అసోం చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం

482views

సోంలో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా భగ్‌జన్‌ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) సంస్థకు చెందిన చమురు బావిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత 14 రోజులుగా సంస్థకు చెందిన చమురు బావిలో గ్యాస్‌ లీక్ అవుతోంది. సోమవారం సింగపూర్ నుంచి వచ్చిన నిపుణుల బృందం గ్యాస్‌ లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నించింది. అదుపులోకి రాకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమయిన పొగలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో ఓఎన్జీసీకి చెందిన సిబ్బందికి స్వల్పగాయాలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో నివసించే ఆరువేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా నష్టపోయిన వారికి రూ.30,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఓఐఎల్ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.