News

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు?

466views

దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకూ అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్దలను అతలాకుతలం చేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని డ్రాగన్ దేశం చైనా ప్రయత్నించిందని అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ తో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సు సందర్భంగా మొత్తం 62 దేశాల నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

భారత్ మద్దతు :

కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయంగా ఓ స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించి బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ కు భారత్ కూడా మద్దతిచ్చింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సులో ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాలు చేసిన డిమాండ్ కు భారత్ మద్దతు పలికింది. ప్రపంచంలో ఇతర దేశాలతో పాటు కరోనా వైరస్ బాధిత దేశంగా ఉన్న భారత్.. కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేయించాల్సిందేనని తాజాగా డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.