News

ఆఫ్గన్‌లో పేలుడు… ఐదుగురి మృతి

Health workers evacuate a body after an attack that targeted a bus carrying government employees in Kabul, Afghanistan, Monday, June 3, 2019. Afghan officials said a sticky bomb attached to the bus detonated in the capital. Wahidullah Mayar, spokesman for the public health ministry, said five people were killed and 10 wounded in initial casualty reports and could rise. (AP Photo/Rahmat Gul)
941views

ఫ్గనిస్థాన్‌ తూర్పు ప్రాంతంలోని గార్దెజ్‌ పట్టణంలో ఈ రోజు జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. జనసాంద్రత అధికంగా ఉండే ఓ మిలిటరీ కోర్టు సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిన ఓ ట్రక్కును దుండగులు పేల్చివేశారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ కావచ్చని అధికారిక ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు.

మంగళవారం కాబూల్‌లో ఓ ఆసుపత్రిలో జరిగిన కాల్పుల ఘటనలో మహిళలు, నవజాత శిశువులతో సహా 24 మంది మరణించారు. మరో వైపు ఐఎస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 32 మంది మృతిచెందారు. కాగా, ఈ దాడులను అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తీవ్రంగా ఖండించారు. రక్షణాత్మక వైఖరికి బదులుగా ఎదురు దాడి వ్యూహాన్ని అవలంబించాల్సిందిగా ఆయన ఆ దేశ భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.