పున్నమి వెన్నెల్లో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట: శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడయ్యాడు.. సీతాదేవిని మురిపించిన రఘుకులసోముడు కల్యాణవేదికను అధిష్ఠించాడు.. సిగ్గులొలుకుతూ కూర్చున్న జనకమహారాజు పుత్రికను పరిణయమాడాడు. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల ప్రతిధ్వనులు.. తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల మధ్య అయోధ్య రాముడు కల్యాణ...



