రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ
ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్‌తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం. వేగం, భద్రత, ఆవిష్కరణల కోసం రూపొందించిన బ్రిడ్జి ఇందంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఆ ఫోటోలను విడుదల చేశారు. దేశంలోని ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి ఈ బ్రిడ్జి కలుపుతుందని ఆయన తెలిపారు. ఈ వంతన మధ్యలో భారీ ఓడలు...








