కాత్యాయని దేవిగా కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. చంద్రహాసోజ్జ్వలకరా ! శార్దూలవరవాహనా ! కాత్యాయనీ ! శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ !! శరన్నవరాత్రి మహోత్సవములలో శుద్ధచవితినాడు శ్రీ అమ్మవారు...









