స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 44 ; బొక్కా చలపతిరావు
బొక్కా చలపతిరావు గుడివాడ 1930లో స్కూల్ ఫైనల్ చదువుతూ స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకాడు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో, ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆరోజు ఖాదీ కట్టిన చలపతిరావు జీవితం అంతా ఖద్దరు తోనే గడిపాడు. మీసాలు సరిగా రానివాడు ఉద్యమం చేసేవాడా...









