News

కరోనా పరీక్షకు సిద్ధమవుతున్న స్వదేశీ కిట్లు

1.1kviews

హైదరాబాదులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) దేశీయ పరిజ్ఞానంతో కరోనా కిట్లను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్లు చాలా వరకు దేశాలనుంచి దిగుమతి చేసుకున్నవే. వీటి ధర ఎక్కువగా ఉండడమే కాదు కొరత సైతం వేధిస్తున్న విషయం విధితమే. ఐ ఐ సి టి తమ ప్రయోగశాలలో ఆర్ టి – పి సి ఆర్ కరోనా కరోనా కిట్లలో వాడే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ తో సహా మూడు రకాల ఎంజైములు, ఇతర రసాయనాలను తయారుచేసింది. పరీక్ష కిట్లో ఉపయోగించే తక్మాన్ ప్రోబ్స్ తయారీకి జినోమిక్స్ బయోటెక్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కిట్ల పని తీరుపై ఇరు సంస్థలు సంతృప్తి వ్యక్తం చేశాయి. వీటిని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసే ముందు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. కిట్ల ధ్రువీకరణ వేగంగా పూర్తి చేసేందుకు సిసిఎంబి వంటి సంస్థలకు ఐ సి ఎం ఆర్ అధికారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్ లేదా సిసిఎంబి వీటి పనితీరును పరీక్షించి అనుమతి ఇచ్చే ప్రక్రియ కొన్ని వారాల్లోనే పూర్తవుతుందని ఐ ఐ సి టి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ధ్రువీకరణ రాగానే వారంలో రెండున్నర లక్షల కిట్లకు అవసరమైన ఎంజైమ్ లు, రసాయనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఐ ఐ సి టి కి ఉన్నదని పరిశోధనలో పాల్గొన్న సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఆంటోనీ అడ్ల గడ్డ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.