News

శబరిమల అభివృద్ధికి తిరుపతి మోడల్‌!

31views

శబరిమల ఆలయ అభివృద్ధిపై కేరళం సీఎం వీడీ సతీశన్‌ కీలక ప్రకటన చేశారు. తిరుపతి తరహాలో శబరిమలను అత్యాధునిక వసతులతో కూడిన ఆధునిక తీర్థయాత్ర కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తోందన్నారు. కొచ్చి విమానాశ్రయంలో అయ్యప్ప భక్తుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన శబరిమల యాత్రికుల ప్రత్యేక సదుపాయ కేంద్రాన్ని సీఎం సతీశన్‌ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, రెండు నెలల పాటు సాగే వార్షిక మకరవిళక్కు సీజన్‌ ప్రారంభమైంది. అయ్యప్ప ఆలయాన్ని తెల్లవారుజామున 3 గంటలకు తెరిచారు. దీంతో శబరిమల కొండకు భక్తులు వేలాది సంఖ్యలో పోటెత్తుతున్నారు. వర్చువల్‌ క్యూ బుకింగ్‌ లేని భక్తులు ఆలయానికి యాత్ర ప్రారంభించే ముందు నిర్దేశిత కేంద్రాల వద్ద టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజూ వర్చువల్‌ క్యూ సిస్టమ్‌ ద్వారా బుక్‌ చేసుకొనేందుకు 60 వేల మంది భక్తులకు అవకాశం కల్పించారు. స్పాట్‌ బుకింగ్‌ ద్వారా మరో 14 వేల మందికి అవకాశం ఉంటుంది.