
శ్రీనగర్ : శ్రీనగర్: కాశ్మీర్ లోయలో ఒక ముఖ్యమైన ప్రజా అనుసంధాన కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (JKDF) మరియు అల్ రహీమ్ ట్రస్ట్‌లతో కలిసి శ్రీనగర్‌లో ఒక భారీ సదస్సును నిర్వహించింది. చర్చలు, పరస్పర అవగాహన మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ సదస్సులో వ్యాపారులు, యువ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, మేధావులు, మత పెద్దలు మరియు ప్రముఖ వ్యక్తులు ఒకే వేదికపై సమావేశమయ్యారు.
‘అస్లుక్ ఆలావ్’ (our call) నినాదం కింద జరిగిన ఈ సదస్సు, సమాజంలోని విభిన్న వర్గాల మధ్య నిర్మాణాత్మక సంబంధాలను ప్రోత్సహించడానికి మరియు జమ్మూ కాశ్మీర్లో శాంతి, సహకారం, అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి దృక్పథాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క ప్రముఖ్ రామ్ లాల్ హాజరయ్యారు. ఆయన పాల్గొనడం ద్వారా,జమ్మూ లోయలోని వివిధ సామాజిక వర్గాలతో చర్చలు, ప్రజలతో అనుసంధానం ఎలా చేస్తున్నారో, చేసిన కృషి ఏమిటో తెలియజేస్తుంది.
హాజరైన ప్రముఖులలో జమ్మూ మరియు కాశ్మీర్ వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ డాక్టర్ సయ్యద్ దరఖాన్ ఆంద్రాబి ఉన్నారు; అశోక్ కౌల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థ); ఇస్లామిక్ పండితుడు మౌలానా ఒవైస్ రజా ఖాద్రీ; ముఖేష్ కుమార్ సునీల్ వీసా; ఆదిల్ మొహియుద్దీన్; JKDF ఛైర్మన్ బిలాల్ పర్రే; మరియు అల్ రహీమ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ అహ్మద్ గిల్కర్.
జమ్మూ కాశ్మీర్ పురోగతిలో సామూహిక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతపై చర్చించడానికి మరియు ఆలోచనలను పంచుకోవడానికి, విభిన్న వృత్తిపరమైన, సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన నేపథ్యాల నుండి పాల్గొనేవారిని ఒకచోట చేర్చి, పర్రే మరియు గిల్కర్ నాయకత్వంలో ఈ సమావేశం నిర్వహించారు.
జమ్మూ మరియు కాశ్మీర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రారంభించిన ‘అస్లుక్ ఆలావ్’ కార్యక్రమానికి శ్రీనగర్ సమావేశం పరాకాష్టగా నిలిచింది. ఈ కార్యక్రమం కింద, నిర్మాణాత్మక సంభాషణలను ప్రోత్సహించడానికి, పరస్పర అవగాహనను బలోపేతం చేయడానికి మరియు విభిన్న దృక్కోణాలు గల వర్గాల మధ్య భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ఇప్పటికే ఐదు అంశాల ఆధారిత సెమినార్లు నిర్వహించారు.
ఈ చర్చల ఆధారంగా ముగింపు సదస్సు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి, సామాజిక సమైక్యత మరియు అభివృద్ధి దిశగా కలిసికట్టుగా పనిచేయడానికి, వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, మరియు ఇతర భాగస్వాములు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, ఉమ్మడి అంశాలను అన్వేషించడానికి ఇది ఒక విస్తృత వేదికను అందించింది.వివిధ నేపథ్యాల నుండి ప్రజలు పాల్గొనేలా అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. ఇది భిన్నమైన గొంతులను ఒకే సంభాషణ వేదికపైకి తీసుకురావాలనే ఆశయానికి అద్దం పడుతోంది.
సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క ప్రముఖ్ రామ్ లాల్ మాట్లాడుతూ, సమాజంలోని వివిధ వర్గాల మధ్య నిరంతరం చర్చలు జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, సామాజిక ఐక్యతను గట్టిపరచుకోవడానికి అర్ధవంతమైన సంభాషణ ఎంతైనా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.”సమాజంలోని వివిధ వర్గాల మధ్య సంభాషణ మరియు సత్సంబంధాలు పరస్పర అవగాహనను, విశ్వాసాన్ని మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి ఎంతో అవసరం” అని రామ్ లాల్ అన్నారు.
వివిధ నేపథ్యాల ప్రజలు భావాలను పంచుకోవడానికి, అలాగే జమ్మూ కాశ్మీర్ పురోగతికి తోడ్పడటానికి ఒక సాధారణ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ‘అస్లుక్ ఆలావ్’ (Asluk Aalav) కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు JKDF చైర్మన్ బిలాల్ పర్రై తెలిపారు.”అస్లుక్ ఆలావ్ ద్వారా, వివిధ నేపథ్యాల ప్రజలు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి మరియు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి, సామరస్యానికి తోడ్పడేలా ఒక ఉమ్మడి వేదికను సృష్టించడమే మా ప్రయత్నం” అని పర్రై పేర్కొన్నారు.
“అస్లుక్ ఆలావ్ ద్వారా, వివిధ నేపథ్యాల ప్రజలు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి మరియు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి, సామరస్యానికి తోడ్పడేలా ఒక ఉమ్మడి వేదికను సృష్టించడమే మా ప్రయత్నం” అని పర్రై పేర్కొన్నారు.ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మరియు ఈ ప్రాంత అభివృద్ధిలో సమిష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో నిర్మాణాత్మకమైన చర్చల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
అల్ రహీమ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ అహ్మద్ గిల్కర్ కూడా చర్చలు మరియు సహకారాల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. కమ్యూనిటీల మధ్య బలమైన బంధాలను పెంపొందించడానికి తమ సంస్థలు చేస్తున్న కృషికి ఈ సదస్సు నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
“శాంతియుతమైన, వర్ధిల్లుతున్న జమ్మూ కాశ్మీర్ కోసం చర్చలు, సహకారం మరియు ఉమ్మడి దృక్పథంతో సమాజాలను ఏకం చేయాలనే మా నిబద్ధతకు ఈ సదస్సు అద్దం పడుతోంది” అని గిల్కర్ అన్నారు.
కేవలం ఒక్కసారితో సరిపెట్టకుండా, సమాజంలోని వివిధ వర్గాల మధ్య నిరంతరం పరస్పర సంబంధాలు కొనసాగేలా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.





