News

సొంత సైనికుల మృతదేహాలనూ పాక్ వదిలేస్తే వారికి భారత ఆర్మీ.. సంప్రదాయాల ప్రకారం అంత్య క్రియలు నిర్వహించింది

34views

అంతర్జాతీయ వేదిక మీద భారత్ పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్ కు మరో సారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన దాయాదికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ భావికా మంగళానందన్ గట్టి సమాధానమిచ్చారు. ‘అసాధా రణ పరిస్థితుల్లో అంత్యక్రియల హక్కులు.. మత విశ్వాసాలు’ అనే అంశంపై జరిగిన చర్చలో మంగళానందన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కార్గిల్ యుద్ధం (1999)లో మరణించిన సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించని ఒక దేశం.. విశ్వాసం, మత స్వేచ్ఛ, ఖననాల గురించి మాట్లాడటం విడ్డూరం. వారు తమ సైనికుల మృతదేహా లను వదిలివెళ్లిన పరిస్థితుల్లో భారత ఆర్మీ.. సైనిక లాంఛనాలతో, ఇస్లాం సంప్రదాయాల ప్రకారం అంత్య క్రియలు నిర్వహించింది. ఒక ఉగ్రవాది అమాయక ప్రజలను చంపడమే కాకుండా.. ఒక దేశ మనోస్ట్రె ర్యాన్ని దెబ్బతీస్తాడు. అలాంటి ఉగ్రవాదుల హక్కుల కోసం తీవ్రంగా వాదిస్తున్న పాకిస్థాన్.. ఉగ్రవాద బాధితుల హక్కుల గురించి ఆలోచించకపోవడం ఆశ్చర్యకరం’ అని మంగళానందన్ పేర్కొన్నారు.