
40views
దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా పోస్టల్ సర్వీస్ (యూఎస్ పీఎస్) 2026 సంవత్సరానికి సంబం ధించి ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. సంప్రదాయ రంగోలి నమూనాతో రూపొందించిన ఈ స్టాంపును వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబారి కార్యాలయంలో ఆవిష్కరించారు. హ్యూస్టన్ లో నివసిస్తున్న భారతీయ కళాకా రిణి సంగీతా భూతదా ఈ స్టాంపు కోసం రంగోలి నమూనాను రూపొందించారు. ఈ స్టాంపును జెన్ని ఫర్ ఆర్నాల్డ్ రూపొందించగా, విలియం జె.గికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. దీపావళి సందర్భంగా యూఎస్పీఎస్ స్టాంపును విడుదల చేయడం ఇది రెండోసారి. తొలిసారిగా 2016లో దీపావళి స్టాంపును విడుదల చేశారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, యూఎస్ పీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శిబానీ గంభీర్, కళాకారిణి సంగీతా భూతదా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





