
కొచ్చి : ఇన్ని రోజుల పాటు క్రిస్ట్రియన్ మిషనరీలు హిందూ దేవీ దేవతలు, హిందూ ఆరాధన పద్ధతులు, సంప్రదాయలపై విమర్శలు చేస్తూ, హేళన చేస్తూ వచ్చారు. అలాగే అక్రమ మత మార్పిళ్ల ద్వారా హిందూ దేవతలపై అపనమ్మకం కలిగేలా కూడా ప్రవర్తించారు. తాజాగా.. ఇప్పుడు శాస్త్రీయ సంగీతంపై కన్నేశాయి మిషనరీలు. శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వారి భవిష్యత్తు నాశనం అయిపోతుందని, వినాశకరం అవుతుందంటూ ప్రచారాలకు తెరలేపారు.
శాస్త్రీయ నృత్యానికి బదులుగా యేసు క్రీస్తును ప్రార్థించాలి అంటూ చెప్పుకొస్తున్నారు. బాలబాలికలకు శాస్త్రీయ నృత్య శిక్షణను ఖండిస్తూ, దాని స్థానే క్రీస్తును ప్రార్థించాలట. దీనికి సంబంధించి పక్కా తేదీ లేని ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. క్రైస్తవ సన్యాసిని భారతీయ శాస్త్రీయ నృత్య శిక్షణనూ విమర్శిస్తూ, ఖండిస్తూ కనిపిస్తోంది. శాస్త్రీయ నృత్య శిక్షణ అనేది దేవతారాధనతో సమానమంటూ ముడిపెట్టేసింది.
శాస్త్రీయ నృత్యం చేసే సమయంలో మతపరమైన సంప్రదాయం వుంటుందని, ఇది అందరికీ తెలుసని చెబుతోంది. నృత్యం నేర్చుకుంటున్న అమ్మాయిల తలలను తాను తాకినప్పుడు, వారు “నిరాకార దేవుళ్ళు” అన్న అనుభూతిని పొందుతారని వాదిస్తోంది. అంతేకాకుండా మరో అత్యంత వింతైన వాదనను ఆ క్రిస్టియన్ సన్యాసిని ముందుకు తెచ్చింది. నృత్యం చేసేటప్పుడు వారు ఆరాధించే దేవుళ్ల రూపాలను యేసుక్రీస్తు వారి ముందరికి తెస్తారట. ఈ విషయాన్ని క్రైస్తవ సన్యాసే చెబుతోంది.
అయితే.. నృత్యం మాత్రం చాలా మంచిదని, కానీ.. అప్పుడు పాటించే సంప్రదాయం, పద్ధతులే మంచివి కాదని చెబుతోంది. అసలు ఈ విషయాన్ని అమ్మాయిలు గ్రహించడమే లేదని, వారి తల్లిదండ్రులు కూడా దీనిని గమనించడం లేదని విమర్శలకు దిగింది క్రైస్తవ సన్యాసి. దీంతో తల్లిదండ్రులు ప్రార్థనా మందిరాలకు తీసుకొస్తున్నారని, అప్పుడు ఇలా ఎందుకు జరిగిందో యేసు క్రీస్తు కారణాలను తెలియజేస్తారని తెలిపింది. నృత్య సాధన ద్వారా నిరాకార పరబ్రహ్మాన్ని అనుభవిస్తారని, పిల్లలు దీనిని వెంటనే గమనించి, యేసు క్రీస్తును ప్రార్థించాలని, లేదంటే వారి భవిష్యత్తే అంధకారంలోకి వెళ్లిపోతోందని భయబ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటివరకు, క్రైస్తవ మతగురువులు మరియు సన్యాసినులు బాలికలను ప్రదర్శన కళలను అభ్యసించడానికి, ప్రదర్శించడానికి ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు జరిగిన తాజా పరిణామం కేరళ ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇది క్రైస్తవ మతగురువుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు అయితే, అది సామాజిక సామరస్యానికి మంచిది కాదు.