
7views
పశ్చిమ బెంగాల్: జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ‘కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలి’ వంటి నినాదాలు చేసే శక్తులను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని బీజేపీ నేత సువేందు అధికారి హెచ్చరించారు.
సెప్టెంబర్ 9న జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన ‘భగవా సమ్మాన్ యాత్ర’కు ఆయన నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సాధువులు, ఋషులతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు. యాత్రలో ‘జై శ్రీరామ్’ నినాదాలు మారుమోగాయి.
విశ్వవిద్యాలయంలో ఇటీవల కొందరు విద్యార్థులు ‘కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలి’ అంటూ నినాదాలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ యాత్రను నిర్వహించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
కాషాయ రంగు గౌరవాన్ని కాపాడటం, దానిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించడమే యాత్ర ఉద్దేశమని వారు పేర్కొన్నారు.





