
“వందేమాతరం”, “భారత్ మాతా కీ జై” వంటి దేశభక్తి నినాదాలకు లభిస్తున్న ప్రజాదరణ.. ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న స్పష్టమైన మార్పుకు నిదర్శనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జాతీయవాద భావజాలం పట్ల ఉన్న వ్యతిరేకత తొలగిపోయి, ప్రస్తుతం దానికి విస్తృతమైన ఆమోదం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆగాస్టు 6న కోజికోడ్‌లోని కేసరి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ABVP వ్యవస్థాపకులలో ఒకరైన ప్రొఫెసర్ యశ్వంత్ రావు కేల్కర్ జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ABVP జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి. రాజ్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలకృష్ణ, క్షేత్రీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమారేష్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైశాఖ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదర్శ్ రవి, విచార్ విభాగ్ కన్వీనర్ అమల్ మనోజ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె.టి. అతుల్ దాస్, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎస్. రామానుణ్ణి, మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.జి. వేణుగోపాల్ మరియు మిజోరం, గోవా మాజీ గవర్నర్ అడ్వకేట్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.





