News

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే సంకల్పంతో 12 జ్యోతిర్లింగాల పాదయాత్ర

10views

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, అఖండ భారతం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ గ్రామానికి చెందిన జాదవ్ మాధవ్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. 12 జ్యోతిర్లింగాల దర్శనం లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ యాత్ర ప్రస్తుతం ఒడిశా వైపు కొనసాగుతోంది.

జాదవ్ మాధవ్ మే 11న మంచిర్యాలలో గోమాత మాలధారణ స్వీకరించి తన పాదయాత్రను ప్రారంభించారు. మార్గమధ్యంలో ఒడిశాలోని పూరీ జగన్నాథుడి దర్శనం కోసం వెళ్లారు.

తన యాత్రలో భాగంగా మొదటగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్‌ఘర్‌లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోనున్నట్లు మాధవ్ తెలిపారు. అనంతరం దేశంలోని ఇతర జ్యోతిర్లింగాలను సందర్శిస్తూ సుమారు ఏడాది పాటు 15 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు.

చివరిగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ దర్శనంతో తన యాత్రను పూర్తి చేస్తానని ఆయన వెల్లడించారు. దేశ శాంతి, సుభిక్షం, ధార్మిక సంకల్పంతో చేపట్టిన ఈ పాదయాత్రపై పలువురు స్థానికులు అభినందనలు తెలిపారు.