
1.5kviews
నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు శ్వాసకోశ వ్యాధుల విభాగము (పల్మనాలజీ విభాగము) ప్రారంభించబడినది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య గుప్తా మాట్లాడుతూ ఇకనుంచి జయభారత్ హాస్పిటల్ లో నెమ్ము, అలర్జీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రతిరోజు తమ సేవలు అందిస్తామని, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్యాన్ని పొందగలరని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ సౌకర్యం కూడా ఉన్నదని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అవసరమైన వారు 0861 2326204, 8099927266, 8099927268, 8099927267 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.





