News

తిరుపతిలో ‘వందే గోమాతరం–2026’ మహాకార్యక్రమం..

36views

గోమాత పరిరక్షణ, భారతీయ సంస్కృతి విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జూలై 10న తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘వందే గోమాతరం–2026’ మహాకార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు 10 వేల మంది విద్యార్థుల భాగస్వామ్యంతో గోమాత పరిరక్షణ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న విశిష్ట స్థానాన్ని, గోసంరక్షణ ఆవశ్యకతను యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థులు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌, 7799884561, విశ్వం సైనిక్‌ స్కూల్‌ 7013563928 ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధాన కో-ఆర్డినేటర్‌, ఆర్కే విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టి. రామకృష్ణారెడ్డి, విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్. విశ్వచందన్‌రెడ్డి, అన్నమయ్య డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీరామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.