News

కాశ్మీర్ జొలికొస్తే మాత్రం ఊరుకోబోము

5views

కాశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ అదర్భాగమేనని.. దాని జొలికొస్తే మాత్రం ఊరుకోబోమని పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో జరగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి-UNHRC 62వ సమావేశాల్లో పాకిస్తాన్, ఓఐసీ దేశాలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై ఇండియా తీవ్రంగా స్పందించింది. ఐరాసలో భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి అనుపమ సింగ్ రైట్ ఆఫ్ రిప్లై ద్వారా పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇస్లామిక్ సహకార సంస్థ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని భారత్ పూర్తిగా తిరస్కరించింది. పాకిస్తాన్ తన దేశీయ వైఫల్యాలను, ఉగ్రవాదానికి అందిస్తున్న మద్దతును దాచుకోవడానికే అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని రావాలాకోట్‌లో జరుగుతున్న దారుణాలను, పౌరుల హత్యలను, నిరసనలపై జరుగుతున్న క్రూరమైన అణచివేతను పాక్ ప్రచారం దాచలేదని, కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోబమని అనుపమ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఒక విధానంగా భావించే దేశం.. స్నేహం, సద్భావనపై ఆధారపడి ఉండే సహకార ప్రయోజనాలను ఆశించడం హాస్యాస్పదమని, 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు లేదని ఆమె కామెంట్ చేశారు.