News

RSS చట్టబద్ధతపై డాక్టర్ మోహన్ భాగవత్ స్పందన

28views

RSS రిజిస్ట్రేషన్ గురించి వచ్చిన వ్యాఖ్యలపై RSS సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రతిస్పందన…

“ఈ అంశంపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ కాకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. మాది ఏదీ రహస్యం కాదు.. బహిరంగంగానే పనిచేస్తున్నాం. మేం ప్రజలను పిలిచి సంఘ్ గురించి చెబుతున్నాం. ఇదంతా రాజకీయం. ఇలాంటి ఎత్తుగడలు వేయడం సహజం. మాకు ఇవన్నీ అలవాటే. సంఘ్ ఏర్పడిన 10-15 ఏళ్ల నుంచే, మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాము. మాకు ఇవన్నీ అలవాటే… అక్కడేమీ ఉండదు గానీ, ఏదో ఉన్నట్టు అనుకుంటాం. అందువల్ల మేం స్పందించాల్సిన పని లేదు. బ్రిటిష్ కాలంలో సంఘ్ ఏర్పడింది. ప్రజామోదంతోనే ఆరంభమైంది. అప్పట్లో మేధోమధనం జరిపినవారు ముందుకెలా సాగారో మీకు చెప్పాను. ఏకాభిప్రాయంతో కార్యాచరణ సాగింది. అదీ సంఘ్ అంటే.. అందుకే దానికి ఎలాంటి ఆటంకం లేదు. హిందూ ధర్మం కూడా రిజిస్టర్ కాలేదు. అలా చాలానే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎవరైతే నిధులు కావాలనుకుంటారో వారికి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అది అవసరం. అయితే, సంఘ్ ఉందన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది. తర్వాత ఎత్తేశారు. ఒకసారి కోర్టు ఆదేశంతోను, మరోసారి సత్యాగ్రహం కారణంగా.. అందువల్ల ప్రభుత్వానికి తెలుసు.. వారు ఆరెస్సెస్‌ని నిషేధించారు అంటే, ఆర్ఎస్ఎస్‍ని గుర్తించారు అని. కనుక ఈ వందేళ్ళల్లో ఇలాంటివి చాలా జరిగాయి. మేం రిజిస్టర్ కావాలని ఏ ఒక్కరు చెప్పలేదు. మా లిఖితపూర్వక రాజ్యాంగం ప్రభుత్వం దగ్గరుంది. మేం 1950ల్లోనే సమర్పించాము. అప్పుడే ప్రభుత్వం చెప్పవచ్చు మేం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందని. అప్పుడే మేం కూడా చేసేవారం. వాళ్ళు ఏమీ చెప్పలేదు. అందుచేత నేనెందుకు స్పందించాలి? ఇదంతా రాజకీయం. ఇదేమంత తీవ్రమైన విషయం కాదు. ఏదో ఒక విధంగా సంఘ్ పనిని ఒకవైపు అడ్డుకుని, ప్రజల మనస్సుల్లో అనుమానాలు రేకెత్తించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇకపై ఇలాంటివి సాధ్యం కాదు, ఎందుకంటే ప్రజలకు మేమేంటో తెలుసు. మేము రహస్యంగా పనిచేస్తున్నామని వారు (విమర్శలు చేసేవారు) అంటారు. మా కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లోనూ నివసిస్తుంటారు. ప్రజలు వారిని ప్రతిరోజూ చూస్తుంటారు. మా శాఖలు బహిరంగ మైదానాల్లో జరుగుతాయి. ప్రజలు వాటిని ప్రతిరోజూ చూస్తుంటారు. మాకు బహిరంగ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ఏడాది మేం ఎందరినో చేరుకున్నాం. ప్రతి బ్లాక్‌లోనూ హిందూ సమ్మేళనం చేసుకున్నాం. మా పని రహస్యం అయితే ఇవేవీ సాధ్యం కాదు.” అని తెలిపారు.

డాక్టర్ మోహన్ భాగవత్ ప్రతిస్పందన వీడియో లింక్..