News

బిహార్‌ చేతికళకు భౌగోళిక గుర్తింపు

0views

బిహార్‌కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) లభించింది. నలందాకు చెందిన బావన్‌ బూటీ చీరలు – వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్థర్‌కట్టీ శిల్పాలు, భోజ్‌పుర్‌ పీడియా పెయింటింగులకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. ఈ మేరకు బిహార్‌ నాబార్డ్‌ నుంచి వెలువడిన ప్రకటన.. పై మూడు ఉత్పత్తులతో రాష్ట్ర హస్తకళలు, చేనేత రంగాలకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఓ కొత్త గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలను పెంచి, వారి ఆదాయ మార్గాలు పెంపొందుతాయని తెలిపింది. ‘‘ఈ ఉత్పత్తులు బిహార్‌ సాంస్కృతిక గుర్తింపు చిహ్నాలు మాత్రమే కాదు, వేలాది కళాకారుల జీవనోపాధికి ప్రధాన వనరులు’’ అని నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజరు గౌతంకుమార్‌ సింగ్‌ తెలిపారు.