News

యోగాభ్యాసంతో మానసిక ప్రశాంతత, సర్వతోముఖ వికాసం: టిటిడి ఈవో

29views

మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తమని టిటిడి  ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై  తిరుమల శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుదర్మ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి 21 వరకు టిటిడి ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జూన్ 21న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం వేలాది మంది పాల్గొనే యోగా అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు.