News

పశువుల అక్రమ తరలింపు వాహనాలు సీజ్‌

100views

పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్‌ చేసి పది పశువులను గోశాలకు తరలించినట్లు పీలేరు సీఐ యుగంధర్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో అన్నమయ్య జిల్లాలోని పీలేరు మండలం తలపుల నుంచి పది పశువులతో రెండు వాహనాలు పుంగనూరుకు వెళుతుండగా స్థానిక క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాలు ఆపి పరిశీలించారు. అయితే వాహనదారులు పశువుల తరలింపుకు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడం, తగిన పత్రాలు చూపించకపోకపోవడంతో వాహనాలను సీజ్‌ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పశువులను చిన్నగొట్టిగల్లు గోశాలకు తరలించారు. పుంగనూరుకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు