
0views
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ. సరిహద్దును శత్రుదుర్భేద్యంగా మార్చనున్నట్లు తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నిర్వహించిన వార్షిక రుస్తమ్జీ మెమోరియల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోకి చొరబడిన ప్రతి ఒక్కరిని గుర్తించి, వారిని వెలుపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. ‘‘బీఎస్‌ఎఫ్ ఏర్పడిన 60వ సంవత్సరంలో ఈ స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. పాక్, బంగ్లా సరిహద్దులను అభేద్యంగా మారుస్తాం. బలమైన భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికత, డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాలు సహాయపడతాయి’’ అని తెలిపారు.





