
0views
స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘‘స్వదేశీ వ్యాపారుల సమ్మేళనం’’ జరిగింది. లక్నో వేదికగా రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. దేశ ఆర్థిక స్వావలంబన మరియు వ్యాపార వర్గాల అభ్యున్నతికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమ్మేళనంలో కాశ్మీరీ లాల్, సతీష్ కుమార్, జాతీయ వ్యాపారుల సంక్షేమ మండలి అధ్యక్షులు సునీల్ సింఘీ మార్గదర్శనం చేశారు. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థల అధిపతులు హాజరయ్యారు.
అయితే.. ఈ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయం కూడా మరొకటి జరిగింది. ఇకపై స్వదేశీ వ్యాపారి జుటన్ ను ‘‘స్వదేశీ వ్యాపారి మంచ్’’ గా పిలుస్తారు. దీని సంఘటన ప్రతి రాష్ట్రంలోనూ, రాష్ట్రం నుంచి జిల్లా వరకూ విస్తరించాలని కూడా నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనే కాకుండా, ఇకపై ప్రతి జిల్లాలోనూ ‘వ్యాపారుల సంక్షేమ మండలి’ ఏర్పాటయ్యేలా ఫోరం పటిష్టమైన మరియు సమర్థవంతమైన కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే దేశ హితం – వ్యాపార హితం – వ్యాపారుల హితం’’ అనే మూల మంత్రం ద్వారా నడుస్తుంది. చిన్న వ్యాపారి, పెద్ద వ్యాపారి అన్న తేడా లేకుండా అందర్నీ కలుపుకొని వెళ్తుంది. అలాగే ఏ స్థాయి వ్యాపారి అయినా, ఏదైనా సమస్యను ఎదుర్కుంటే, దానిని పరిష్కరించే దిశగా కూడా స్వదేశీ వ్యాపారి మంచ్ కృషి చేయాలని నిర్ణయించారు.
అలాగే వ్యాపారులను ఎగుమతిదారులుగా తయారు చేయడంతో పాటు భారత్ దేశ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు, అంతర్జాతీయ వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.





