కోహినూర్ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్‌శాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్‌శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్ చేశారు. లండన్ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్‌శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్‌లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలనే అంశం కూడా ముఖ్యమైనదే. మాకు ఈ విగ్రహం కోహినూర్ కంటే విలువైనది. ఇది మత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన అంశం. కేంద్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తే లండన్ నుంచి విగ్రహాన్ని తిరిగి తీసుకురావొచ్చు. 2024లో భోజ్‌శాల ప్రాంగణంలో పురావస్తు శాఖకు లభించిన 94 విగ్రహాలనూ ఈ ప్రాంతంలో తిరిగి ప్రతిష్ఠించాలి’’ అని పిటిషనర్లు కోరారు.
112views
You Might Also Like
ఝార్ఖండ్‌లో 16 మంది మావోయిస్టుల లొంగబాటు
33
ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఐదుగురు మహిళలతో సహా 16 మంది మావోయిస్టులు ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. పలు ఆయుధాలను అప్పగించారు....
అసోం వరద ప్రాంతాల్లో ఆరెస్సెస్ సేవా కార్యక్రమాలు
29
గౌహతి : అసోంలో కొంతలో కొంత వరద పరిస్థితులు బాగుపడినా.. ప్రజలు తమ తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టినా.. అది మోసుకొచ్చిన బురదతో...
ఫుల్బాణీ ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వామి లక్ష్మణానంద సరస్వతీ పేరు
32
ఫుల్బాణీలోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి (GMCH) స్వామి లక్ష్మణానంద సరస్వతి పేరు పెట్టనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు, కంధమాల్ జిల్లాలోని జలేస్పాటా...
సెప్టెంబరు 15 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు
43
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు సెస్టెంబరు 15న ప్రారంభమవుతాయని ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ధర్మకర్తల...
శబరిమలకు రైల్వేలైన్ పనులు ప్రారంభం
38
తిరువనంతపురం: సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితి, జాప్యం తర్వాత, కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో అంగమాలి - శబరి రైల్వే ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది....
పర్యావరణ పరిరక్షణతోనే దైవత్వం సాకారం
47
పాలకొండ: సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని, పర్యావరణ పరిరక్షణ ద్వారా నిజమైన దైవత్వాన్ని అనుభవించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి...





