News

ఆవుల ధృవీకరణ పత్రాలు చూపించాలి

5views

ఆవుల ధృవీకరణ పత్రాలు చూపించాలని బెంగాల్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేపై టీఎంసీ మండిపడింది. హింగల్‌గంజ్ పరిధిలోని లెబుఖాలి ప్రాంతంలో పశువులను రవాణా చేస్తున్న వాహనాన్ని ఆ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. పశువులను వాహనం నుంచి కిందకు దించారు. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు వాటిని కట్టారు. వాటికి గడ్డి, నీరు ఏర్పాటు చేశారు.

కాగా, అక్రమ పశు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాలు జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర తెలిపారు. అలాగే 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పశువులను వధించకూడదని తమ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిందని ఆమె చెప్పారు. ‘14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆవులను వధించడంపై ప్రభుత్వం కఠిన నిషేధం అమలు చేసింది. ఎవరైనా ఆవులను అక్రమంగా రవాణా చేస్తే మేం అడ్డుకుంటాం. ఆవుల ధృవీకరణ పత్రాలు చూపించమని అడుగుతాం. ధృవీకరణ పత్రాన్ని చూపించడంలో విఫలమైతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆమె అన్నారు.